మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దాళ్వాలో వరిసాగు చేయాలా వద్దా అనే విషయం పై స్పష్టత ఒకటి రెండ్రోజులలో జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర పౌరసంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని నాని) తెలిపారు
సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం మండల పరిధిలోని బుద్ధాలపాలెం మాజీ సర్పంచ్ నట్టే ప్రసాద్, ఉయ్యురు బుల్లబ్బాయి తదితర రైతులు మంత్రిని కలిసి దాళ్వా పంటకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. దివిసీమ అవనిగడ్డ నియోజకవర్గ రైతులు , పెడన నియోజక వర్గ ప్రాంత రైతులు దాళ్వా వద్దని అంటున్నారని తీరప్రాంతాలైన బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వరి సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారని అసలు దాళ్వా ఉందొ లేదో జిల్లా ఉన్నతాధికారి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తారని మంత్రి చెప్పారు.
తమ బంధువు ఒకరు కోవిడ్ కారణంగా చనిపోయిందని అయితే ఆ కాలంలో ఆసుపత్రిలో కొవిడ్ మరణమని నమోదు కాలేదని, ఇపుడు ప్రభుత్వం ఆర్ధిక సహాయం ఇస్తుండటంతో మృతుని తాలూకా కుటుంబానికి ఆ నగదు వస్తుంది కనుక ఆ డబ్బు వచ్చేందుకు వైద్యుడు ద్వారా ఆ సర్టిఫికెట్ వచ్చేందుకు మీరు సహాయం చేయాలని కొందరు మంత్రి పేర్ని నానిను అడిగారు. ఆ విధంగా వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వరని కొవిడ్ చికిత్స పొందుతూ చనిపోయిన కాలంలోనే ఆ పత్రం తీసుకోవాలని మంత్రి వారికి సున్నితంగా నచ్చచెప్పారు.
స్థానిక లక్ష్మణరావుపురం రావుపురం ప్రాంతానికి చెందన నరహరశెట్టి పద్మ అనే మహిళ మంత్రికి తన కష్టాన్ని చెప్పుకొంది. సంవత్సరం క్రితం తన భర్త చనిపోయారని వితంతు పింఛన్ రాబవడం లేదని , ఆ;లాగే కాపు నేస్తం సైతం మంజూరు కాలేదని తెలిపింది. స్పందించిన మంత్రి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు దొర్లాయేమో విచారణ చేద్దామని చెప్పారు.
సింగరాయపాలెం ప్రాంతానికి చెందిన పుట్టి నాగమల్లేశ్వరమ్మ అనే వృద్ధురాలు తన సమస్యను మంత్రికి తెలిపింది. తన భర్త లారీ ప్రమాదంలో మృతి చెదరని, ఆ తర్వాత ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్న తన కుమారుడికి కిడ్నీ పాడయ్యాయని డయాలిసిస్ కోసం విజయవాడకు వెళ్లి చేయించుకోవాల్సివస్తుందని తన భర్త బీమా సొమ్ము కోసం ఫామిలీ సర్టిఫికెట్ తీసుకురమ్మని అంటున్నారని ఎంతో కాలం తిరిగి ఆ సర్టిఫికెట్ తెచ్చుకొన్న బీమా సొమ్ము ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మంత్రి పేర్ని నానికు ఆమె తెలిపింది
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …