Breaking News
????????????????????????????????????

న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ సేవలు అభినందనీయం…

-హైకోర్టు సిజె జస్టిస్ పికె మిశ్రా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సుమారు 10 నెలల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ(Joymalya Bagchi) అందించిన సేవలు అభినందనీయమైనమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.ఇప్పటి వరకూ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీకి సోమవారం నేలపాడులోని ఎపి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పికె మిశ్రా మాట్లాడుతూ జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ సుమారు 10 మాసాల పాటు ఎపి హైక్టోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 1105 కేసులను డీల్ చేశారని పేర్కొన్నారు.జస్టిస్ బాగ్చీ న్యాయమూర్తిగా ఎపి హైకోర్టుకు అందించిన సేవలు అభినందీయమైనవని కొనియాడారు. ఆయన పదవీ కాలంలో ముఖ్యంగా ఎక్సైజ్,వాణిజ్య పన్నులు తదితర అంశాల్లో అనేక కేసులకు సంబంధించి పలు తీర్పులు ఇచ్చారని చెప్పారు.ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ఇకపై కూడా అదే రీతిలో పూర్తి ఆరోగ్యవంతంగా ఉండి కలకత్తా హైకోర్టులో కూడా న్యాయమూర్తిగా మరిన్ని సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.
కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడి మూడేళ్ళే అవుతున్నా ఈ హైకోర్టు ఘనమైన చరిత్రను కలిగి ఉందని తెలిపారు. మద్రాసు హైకోర్టు నుండి విడివడి 1954లో గుంటూరు నుండి హైకోర్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని అనంతరం 1956లో హైకోర్టు హైదరాబాదుకు తరలిందని మరలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో హైకోర్టు 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఇక్కడ ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.గతంలో ఇక్కడ బెంచిలో పనిచేసిన పలువురు న్యాయమూర్తులు విశేషమైన తీర్పులు అందించారని ఈ బెంచ్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ బార్ దేశంలోనే ఒక ఉత్తమమైనదని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ పేర్కొన్నారు. రెండవ విడత కరోనా వల్ల తాను బార్ తో అతి తక్కువ సమయం నేరుగా ఇంటరాక్ట్ అయ్యానని, అయినప్పటికీ బార్ సభ్యులు వివిధ కేసులకు సంబంధించిన వాస్తవాలను కోర్టు ప్రొసీడింగ్స్ నిర్వహణకు నిష్పక్షపాతంగా అద్భుతంగా సిద్దం చేసేవారని ఆయన కొనియాడారు. సీనియర్లతో పాటు పలువురు జూనియర్లు కూడా వివిధ కేసుల్లో ఎంతో సహాయపడ్డారని అందువల్లే కోవిడ్ పరిస్థితుల్లోను అధిక సంఖ్యలో కేసులను విచారించి పరిష్కరించగలిగామని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. అంతేగాక బార్ సభ్యుల నిరంతర శ్రమ వల్ల కోవిడ్ సమయంలో కూడా లోక్ అదాలత్ ద్వారా కూడా అనేక తీర్పులు ఇవ్వగలిగామని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ చెప్పారు. ఇక్కడ తన పదవీ కాలంలో అన్ని విధాలా తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.
హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎపి స్టేట్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాధ్, ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకీ రామి రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. అంతకు ముందు ఎపి హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎ.వేణుగోపాల రావు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీని వారి ఛాంబరులో కలసి దుస్శాలువతో సత్కరించారు.
ఈవీడ్కోలు సభలో రిజిస్ట్రార్ జనరల్ బి.ఎస్.భానుమతి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసి క్యూటర్లు,బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *