Breaking News

నగరాభివృద్ధియే లక్ష్యంగా డివిజన్ సమస్యల పరిష్కారం…

-7వ డివిజన్ నందు రూ.14 లక్షల అంచనాలతో యు.జి.డి పనులకు శంకుస్థాపన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్-3 పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజ్ పురం దాసరి రమణ నగర్ నందలి రూ.14 లక్షల అంచనాలతో పలు అంతర్గత రోడ్ల భూగర్భ డ్రైనేజి పైపు లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి లతో క‌లిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి దృష్టిలో ఉంచికొని అనేక కోట్ల రూపాయలతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేయుట జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతములో 6 అంగుళాల పాత డ్రెయినేజి పైపులు ఉండుట కారణంగా డ్రెయినేజి ఇబ్బందులు ఎదురౌతున్న వాటిని తొలగించి వాటి స్థానములో 200 యం.యం. పైపులు వేయుట జరుగుతుందని, ఈ పనులు అన్నియు నెల రోజుల లోపుగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులు మరియు కాంట్రాక్టు ను ఆదేశించారు. కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, డిప్యూటీ ఇంజనీర్ టి.రంగారావు మరియు స్థానిక వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *