Breaking News

కుమారి గెడ్డం స్రవంతి మృతిపై నవంబర్ 5 న విచారణ

-మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో ఉ..10.30 లకు విచారణ
-విచారణ కమిటీ కి తగిన వివరాలు, ఆధారాలు అందచెయ్యగలరు
-ఆర్డీవో ఎస్. మల్లిబాబు

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న గెడ్డం సురేష్ వారి కుమార్తె కుమారి గెడ్డం స్రవంతి ఆక్టోబరు 28 వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ – పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా విచారణ నిమిత్తం కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి వారిని నియమించడం జరిగినదని రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇందు నిమిత్తం మార్టేరులోని ఎస్.సి.సంక్షేమ వసతి గృహం నందు ఈనెల 5వ ఉదయం గం.10.30 గంటల నుంచి బహిరంగ విచారణ నిర్వహిస్తున్నామని మల్లిబాబు తెలియ చేశారు. కావున ఈ సంఘటనపై వివరములు తెలిసినవారు, కుటుంబ సభ్యులైన, గ్రామస్తులైన, ఎవరైనా సరియైన ఆధారాలతో సహా విచారణ కమిటీ ముందు హాజరై సంబంధిత సమాచారమును , వివరాలు అందజేయవలసినదిగా యస్.మల్లి బాబు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *