Breaking News

కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, కార్తీక మాసంలో గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితి నెలకొని, థర్డ్ వేవ్ హెచ్చరికలు చేయడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ ద్వారా ఘాట్ల ను పరిశుభ్రం చెయ్యాల్సి ఉన్నందున మునిసిపాలిటీ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాల్సినదిగా తెలిపారు. కొవ్వూరు మునిసిపల్ కమిషనర్ స్నానాలు నిర్వహించే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, షిఫ్ట్ లు వారీగా సిబ్బందిని నియమిస్తూ, బ్లీచింగ్ చెయ్యాలని మల్లిబాబు పేర్కొన్నారు. భక్తులు క్రమ పద్ధతిలో స్నానాలు ఆచరించేలా బ్యారి కెట్టింగు నిర్మించాలన్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, తాత్కాలికంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చెయ్యాలన్నారు. డిఎస్పీ బి. శ్రీకాంత్, తహసిల్దార్ బి. నాగరాజు నాయక్, సి ఐ సునీల్ కుమార్ , మునిసిపల్, ఆర్ అండ్ బి, ఫైర్, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *