-ఓటరు తో సహా ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు…
-ఎన్నికల కమీషన్ నిబంధల ప్రకారం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మిగిలిపోయిన మున్సిపల్, గ్రామ పంచాయితీల్లో జెడ్పీటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు నిర్వహిస్తున్న ఎన్నికలను అధికారులు నిబంధనలను అనుసరిస్తూ సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టరు జె. నివాస్ యంపీడీవో, మున్సిపర్ కమీషనర్లును ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రక్రియపై ఆయా మండల యంపీడీవో, మున్సిపల్ కమీషనర్లతో వీడియోకాన్ఫ ద్వారా జిల్లా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగిలిపోయిన జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుకు జరుతున్న ఎన్నికల్లో రెవిన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. 2021 అక్టోబరు 11 నాటికి సవరించిన ఓటర్ల జాబితాను సిద్దం చేసుకొని ఎటువంటి తప్పిదాలు లేకుండా ఫోటో తో కూడి ఓటర్ స్లిప్ ను నిర్ణీత సమయలోనే ఓటర్లు అందజేయాలన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్న చోట్ల ఆ డివిజన్ మొత్తం మోడల్ కోడాఆఫ్ కాంటాక్టు అమల్లో ఉంటుందన్నారు. యంపీడీవోలు, ముసిపల్ కమీషనర్లు ముందుగానే ఆయా పోలింగ్ స్టేషన్లు పర్యటించి ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఎటువంటి అసౌర్యం లేకుండా తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సెన్సిటీవ్, హైపర్ సెన్సిటీ గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలను సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కెమారాలు ఏర్పాటు వైబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణ జాయింట్ కలెక్టరు (హౌసింగ్) పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. యంసీసీ, ప్లయింగ్, గణాంక బృందాలు నిబంధనలు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎన్నికలు నిర్వహించే ఆయా గ్రామ పంచాయితీల్లోను, పురపాలక సంఘాల్లోను ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు తప్పనిసరిగా సంబందిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుకు ఆయా అభ్యర్థులు సిపార్సు చేసిన వారికి ముందుగానే పాస్ లు జారీ చేయాలన్నారు. పోలింగ్ రోజు ఓటరు తప్ప ఎవరిని అనుమతించవద్దని అధికారులకు సూచించారు. ఆయా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహిస్తున్న పోలింగ్ స్టేషన్లకు అనుగుణంగా కౌటింగ్ టేబుల్సు ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ ను పక్కా గా ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ఆయా రూట్లకు ముందుగానే ప్రణాళిక ప్రకారం రూట్ ఆఫీసర్లును నియమించాలన్నరు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే విదంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశిల్ మచిలీపట్నం నుంచి వీసీ ద్వారా మాట్లాడుతూ ఎన్నికలు నిర్వ్హహిస్తున్న ఆయా గ్రామాల్లో ఇప్పటికే సెన్సీటివీవ్, హైపర్ సెన్సిటీవ్ గ్రామాలను గుర్తించామని ఆయా గ్రామాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరుకు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివ శంకర్, డిపీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.