– కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రజలకు అందించడంలో అహర్నిశలుకృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు…
-వ్యాక్సినేషన్ వేయించుకోవడం వలన థర్డ్ వేవ్ ను నియంత్రించగలం…
-పిహెచ్ సీలు, సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ -19 నియంత్రణంలో భాగంగా జిల్లాలోకోవిడ్వాక్సినేషన్ప్రక్రియముమ్మరంగాసాగుతోందని నేటితో 50 లక్షల కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను ప్రజలకు వేయించడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. శుక్రవారంనగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కలెక్టరు జె. నివాస్ జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 50 లక్షల కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను ప్రజలకు అందించామన్నారు. ఇందులో భాగంగా 29,99,387 మందికి మొదటి మోతాదులను పూర్తి చేశామన్నారు. రెండవ మోతాదు కింద 19,98,329 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లకు 47,898 మందికి గాను ఇప్పటి వరకు మొదటిమోతాదు 47,605, రెండవ మోతాదు 44,324 వేశామన్నారు. ప్రెంట్ లైన్ వర్కర్లకు 1,97,719 మంది గాను మొదటి మోతాదు 1,98,973 మందికి, రెండవ మోతాదు 1,70,992 మందికి అందించామన్నారు. 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ళు లోపు గల వారికి 17,52,292 మందికి గాను మొదటి మోతాదు 12,92,877 మందికి, రెండవ మోతాదు 6,52,668 మందికి అందించామన్నారు.45 ఏళ్ళు పైబడిన వారికి 12,04,215 మందికి గాను మొదటి మోతాదు 14,59,932 మందికి, రెండవ మోతాదు 11,30,345 మందికి కోవిడ్ టీకాలను ప్రజలకు వేయడం జరిగిందన్నారు. జిల్లాలో50లక్షలమందికివాక్సినేషన్పూర్తికావడంపై కలెక్టరు జె. నివాస్ స్సంతోషంవ్యక్తం చేశారు. కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరిస్తూ ఈ మహాయజ్జంలో పాల్గొని అహర్నిశలు కృషిచేస్తున్నప్రతి ఒక్క ఏఎన్ఎమ్, ఆశా, వైద్యులు, తాహశీల్థార్లు, యంపీడీవోలు, ఇతర జిల్లా అధికారులకు,వాలంటీర్లు,సచివాలయసిబ్బంది,తదితరులకు ముఖ్యంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా కలెక్టరు జె. నివాస్ధన్యవాదాలు తెలిపారు. ఇదేస్ఫూర్తితోనూరుశాతంవాక్సినేషన్పూర్తిచేయాలనిఆయనఆకాంక్షించారు. జిల్లాలో ఇంకా మొదటి, రెండవ కోవిడ్ వ్యాక్సినేషన్ మోతాలు వేయించుకోవలసిన వారు తప్పకుండా వేయించుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోను, పిహెచ్ సీల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నాని కలెక్టరు అన్నారు. కోవిడ్ కట్టడికి నిరంతరం వైద్య ఆరోగ్య సిబ్బంది శ్రమిస్తున్నారని జిల్లా వాసులు వారికి సహకరిస్తూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోని కోవిడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటంతో పాటు థర్డ్ వేవ్ రాకుండా నియంత్రించగలమని కలెక్టరు జె. నివాస్ అన్నారు.