-డిఎల్ పీఓ నాగిరెడ్డి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ డివిజన్ పరిధిలో మిగిలిపోయిన గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుకు నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో చివరిరోజైన శుక్రవారం నాటికి సర్పంచ్ అభ్యర్థులుగా 22 దరఖాస్తులు, వార్డు మెంబర్లుగా 12 దరఖాస్తు ఆయా అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిదని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులకు గాను నందివాడ మండలం పోలు కొండలో 7 నామినేషన్లు, కలిదిండి మండలం కలిదిండిలో ఈరోజు అభ్యర్థులు నామినేషన్లు ధాఖలు కాగా మొత్తం 9 నామినేషన్లు వచ్చాయని, ఇదే మండలం అమరావతి లో ఈ రోజు 2 నామినేషన్లు దాఖలు అయ్యాయని తెలిపారు. ముదినేపల్లి మండలం ములకలపల్లిలో 4గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దరఖాస్తులు చేసారు. వార్డు మెంబర్లుగా గుడివాడ రూరల్ మండలంలో గుంటా కోడూరులో 8 వ వార్డు, పురిటిపాడులో 7 వ వార్డు, గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు 1వ వార్డు, నందివాడ మండలం రుద్రపాక 1 వ వార్డులో కలిదిండి మండలం మట్టగుంటలో 4 వార్డు, 5 వ వార్డు, పామర్రు మండలం జెమిగొల్వేపల్లి 6 వ వార్డులలో ఒక్కోటి చొప్పున అభ్యర్తులు నామినేషన్ వేశారని, కలిదిండి మండలం కొరుకొల్లులో 12 వవార్డుకు సంబందించి 3 నామినేషన్లు, ముదినేపల్లి మండలం శ్రీ హరి పురం 8 వ వార్డుకు సంబందించి 2 నామ నేషన్లు అభ్యర్థులు దాఖలు చేయడం జరిగిందని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి తెలిపారు.