విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ IAS ని వారి చాంబర్లో కలిసి పలు సమస్యలపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, ఉపాధ్యక్షులు వెన్నా.శివ శంకర్ ,కామెల్ల. సోమనాథం, పార్టీ కార్యదర్శిలు శనివారపు శివ, కొర్ర గంజి వెంకటరమణ, వేవినా నాగరాజు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ , పులి చేరి రమేష్ వినతిపత్రం అందచేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ వరకు పూర్తిగా పాడైపోయిన ప్రధాన రహదారిని తక్షణమే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని, టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని, విలువైన కార్పొరేషన్ స్థలాలను పౌండేషన్ వారికి మంజూరు చేయవద్దని కోరుతున్నామని, పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన రహదారి చిట్టినగర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయి అధ్వాన్న స్థితిలో ఉన్నది అనేక సందర్భాల్లో అధికారులు కూడా ఈ అంశాన్ని తెలియజేసినాము కానీ ఇంతవరకు కనీస మరమ్మతులు కూడా నోచుకోలేదని తమరు ఈ ప్రధాన రహదారిని పరిశీలించి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించగలరు అని కోరుతున్నామని, విలువైన కార్పొరేషన్ స్థలాలను ఫౌండేషన్ పేరిట మంజూరు చేయవద్దని కోరుతున్నామని ఎర్రకట్ట వద్ద గల పార్క్ స్థలంలో వెల్లంపల్లి ఫౌండేషన్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసినారని. దీనికి కార్పొరేషన్ వారు ఎస్టిమేషన్ గాని, నిర్మించుటకు అనుమతులు గాని, ఇంజినీరింగ్ విభాగం అనుమతులు గాని, లేవని చెబుతున్నారు కావున తమరు దయవుంచి ఈ అంశాన్ని కూడా పరిశీలించగలరని. ఇక్కడ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ కు VMC వారి పేరును జత చేస్తూ అంబేద్కర్ గారి పేరును లేదా బాబు జగ్జీవన్ రామ్ గారి పేరును నామకరణం చేయవలసిందిగా కోరుతున్నామని, పశ్చిమ నియోజకవర్గం లోని అనేక ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి ముంపునకు గురవుతున్నాయని అందుకు పరిష్కార దిశగా అవుట్ ఫోలో డ్రాయిన్ నిర్మాణం చేపట్టాలని మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూడా ప్రారంభించి పూర్తి చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని, పేద సామాన్య వర్గాల కలయిన సొంత ఇళ్లను టిడ్కో పధకం ద్వారా ప్రభుత్వాలు సాకారం చేసే దిశగా ముందుకు వెళుతున్నాయని జక్కంపూడి ప్రాంతంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించాలని తమ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని వినతిపత్రం లో పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …