-అన్ని పాఠశాలలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి
-ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ప్రధానోపాధ్యాయులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమీషనర్ మాట్లాడుతూ నాడు-నేడు పనులు ఎంతవరకు ప్రారంభామైనది అని తెలుసుకొని పలు సూచనలు చేసారు. పేరెంట్స్ కమిటీ తో అకౌంట్ ఓపెన్ చేయుట, ఎమినిటీస్ సెక్రెటరీలు మరియు ఇంజనీర్స్ తో ఎస్టిమేషన్ వేయించుట, 10 కంపోనేన్ట్స్ లో ప్రయారిటీ ప్రకారం పనులు చేయించుట 10 కంపోనేన్ట్స్ పనులకు ర్యాంకింగ్ వేసి ఆఫీస్ కి సమర్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులని ఆదేశించారు. ప్రభుత్వ పధకాలను సరిగ్గా నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహించాలని, నాడు-నేడు పధకాన్ని అమలు చేయటంలో బాద్యత తీసుకోని పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలలను క్లోజ్ చేయుట వలన మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో చేరినవారు వారికి అవసరమైన స్టాఫ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడిగి తెలుసుకున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం 3,4,5 తరగతుల విద్యార్థులు హై స్కూల్ లో మాప్పింగ్ జరగటం వలన పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఢిల్లీ లో మాదిరిగా మార్నింగ్ సెషన్ మరియు ఈవినింగ్ సెషన్ తరగతులు నిర్వహించుటకు గల అవకాశాలను ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, స్కూల్స్ సూపర్ వైజర్లు, 29 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్ మరియు నాడు-నేడు ఫేజ్-2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.