-ప్రభుత్వ పథకములు అన్నియు ప్రజలకు చేరువ చేయాలి
-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురునానక్ నగర్ నందలి 6వ వార్డ్ సచివాలయం మరియు బి.ఆర్.టి.ఎస్ రోడ్ నందలి 184 & 275 వార్డ్ సచివలయలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలో విధులు నిర్వహించు సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి భాద్యతగా తమకు కేటాయించిన విధులను నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకముల వివరాలు విధిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిస్ ప్లే బోర్డు నందు ప్రదర్శించాలని సూచించారు.