-కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ పనుల పరిశీలన –
-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వరాజ్య మైదానం వద్ద కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయం మరియు చీఫ్ సెక్రటరీ క్యాంపు కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధి పనులను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. అధికారులతో కలసి మొక్కలు నాటి, మంచి ఆకర్షనీయమైన పూల మొక్కలను నాటి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు.
గురునానక్ నగర్ స్విమ్మింగ్ ఫూల్ ఆధునీకరణ పనులు పరిశీలన,
అధికారులు మరియు సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
గురునానక్ నగర్ స్విమ్మింగ్ ఫూల్ ఆధునీకరణ పనులు మరియు APIIC కాలనీ నందలి వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ నిర్మాణ పనుల యొక్క పురోగతిని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా స్విమ్మింగ్ ఫూల్ నందు సివిల్ పనులు పూర్తి అయిన వెంటనే గ్రీనరీ పనులు కూడా చేపటి సుందరంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
అదే విధంగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, ఏ.డి.హెచ్ జె.జ్యోతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.