విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
*జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ ఆదేశించారు. శనివారం నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు భవన్ లో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనీలా శిక్షణ కార్యక్రమంలో జేసీ ఎల్.శివశంకర్,జడ్పీ సీఈవో సూర్యప్రకాష్ రావు, జిల్లా పంచాయతీ అధికారి జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ మెంబర్ ల ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలని, ముఖ్యంగా ఎన్నికల కమీషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలన్నారు, ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పక్కాగా అమలు చేయాలన్నారు. జిల్లాలో మిగిలిపోయిన జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు, ఇతర జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది 100 శాతం సక్రమంగా విధులు నిర్వర్తించే లా శిక్షణ అందించాలన్నారు.ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …