విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్‌లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించి విజయకేతనం ఎగురవేశాయని విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు ఆనందం వ్యక్తం చేశారు. గోసాల శ్రీచైతన్య క్యాంపస్‌లో శనివారం జరిగిన ర్యాంకుల సక్సెస్‌మీట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ 2021లో జాతీయ స్థాయిలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు 5వ ర్యాంకుతోపాటు 10 లోపు 3, 100 లోపు 21తోపాటు 6449 మంది విద్యార్దులు మెడికల్ సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో మరే ఇతర విద్యా సంస్థలు సాధించలేని ఘనవిజయం శ్రీ చైతన్య సాధించడం గర్వకారణమన్నారు. దేశంలోని ప్రముఖమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ వంటి ప్రముఖ విభాగాలలో అత్యంత సమర్థులైన నిష్ణాతులైన టావ్ లెవల్ డాక్టర్లను సమాజానికి అందించిన ఆసియాలోనే ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్య అని అన్నారు. ఇంతటి ఘన విజయం తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల అవిరళ కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, పర్యవేక్షణ వల్ల మాత్రమే సాధ్యమైందని తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఎజీఎం ఎం.మురళీకృష్ణ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …