-అన్‌లక్కీ షర్ట్ దర్శకుడిని సత్కరించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
-ఈ గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం: దర్శకుడు సురంజన్ దే
-విశాఖ అందాలు ఆకట్టుకున్నాయి: బాలివుడ్ హీరోయిన్ శుభశ్రీ కర్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్‌లక్కీ షర్ట్ పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ఆరు అంతర్జాతీయ, పలు జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు నామినేట్ అయిన ఆ చిత్ర దర్శకుడు సురంజన్ దే తెలుగులో ఎఫ్.టి.పి.సి. సంస్థ ఆధ్వర్యంలో ఓ సామాజిక నేపధ్యం కల్గిన రిలేషన్‌షిప్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లొకేషన్‌ల అన్వేషణకై విశాఖకు విచ్చేసిన సురంజన్ దే ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎఫ్.టి.పి.సి) ఘనంగా సన్మానించింది. ఆదివారం స్థానిక హోటల్ దస్‌ఫల్లా ఎగ్జిక్యూటీవ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్.టి.పి.సి. అధ్యక్షులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలివుడ్ నటీమణి శుభశ్రీ కర్‌లకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
దర్శకుడు సురంజన్ దే మాట్లాడుతూ… ఎఫ్.టి.పి.సి. చేపట్టే వివిధ కార్యక్రమాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. సత్కారం అనంతరం ఈ గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని ఆనందం వ్యక్తం చేశారు. ఎఫ్.టి.పి.సి. చేపట్టే దేశవ్యాప్త కార్యక్రమాలకు తనవంతు సహాకారం నిరంతరం ఉంటుందని తెలిపారు. వారితో త్వరలో పశ్చిమ బెంగాల్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన సాంకేతికతను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
ఎఫ్.టి.పి.సి. అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సురంజన్ దే తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడమే ఎఫ్.టి.పి.సి. లక్ష్యమన్నారు. బెంగాల్ ఎంతో ప్రతిభావంతుల పురిటిగడ్డ అని వారిని సన్మానించుకోవడం సంతోషదాయకమన్నారు. సురంజన్ దే ఎంతో అంకితభావంతో చిత్ర నిర్మాతే కాకుండా సినీ విమర్శకులు కూడా. సురంజన్ దే సాధించిన విజయం పట్ల భారతదేశం యావత్తూ గర్విస్తోందని తెలిపారు. త్వరలో వారితో రిలేషన్‌షిప్‌ను రీసెర్చ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జాతీయ స్థాయిలో తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.
ఎఫ్.టి.పి.సి. ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ.. సురంజన్ దేవ్ ప్రతిభ అమోఘమని, సత్యజిత్ రే పుట్టిన బెంగాలి గడ్డ మీద అతను మరెన్నో మంచి చిత్రాలను నిర్మించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ అందమైన లొకేషన్లను ప్రపంచానికి పరిచయం చేయాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెంతో ఎత్తు ఎదగాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర హాస్పిటాలిటీ కమిటీ కో-ఆర్డినేటర్‌గా అల్లు నరేష్
ప్రముఖ వ్యాపారవేత్త అల్లు నరేష్‌ని ఎఫ్.టి.పి.సి. హాస్పిటాలిటీ కమిటీ కో-ఆర్డినేటర్‌గా నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వివిధ రాష్ట్రాల నుండి వచ్చే చలనచిత్ర పరిశ్రమ సంబందీకులకు ఆతిథ్య సేవలు అందించేలా ఈ కమిటీ కృషి చేస్తుందని, అలాంటి ఉన్నత కమిటీకి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా తనను నియమించడం ద్వారా తన బాధ్యత మరింత పెంచిందని అన్నారు.
బాలివుడ్ నటీమణి శుభశ్రీ కర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని బాషల చిత్రాలు షూటింగ్‌లు జరుపుకునేలా దేశంలోని పలు బాషా చిత్రాల నిర్మాణ సంస్థలను, నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తున్న ఎఫ్.టి.పి.సి.కి తన అభినందనలు తెలిపారు. విశాఖ అందాలను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూసిన తరువాత ఎఫ్.టి.పి.సి. వారు విశాఖ లొకేషన్‌ల గురించి చెప్పింది ఇంకా తక్కువే అనిపిస్తోందని, దేశవిదేశాల్లోని ఏ లొకేషన్‌కు తీసిపోని రీతిలో ఇక్కడ అనేక లొకేషన్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా తనవంతు ప్రమోషన్‌ను అందిస్తానని ఆమె వెల్లడించారు.