Breaking News

రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

-బాలలే దేశానికి వెలకట్టలేని ఆస్తి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులన్న భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తన సందేశంలో తెలిపారు. నెహ్రూ దేశానికి ఓ దశ, దిశను చూపించారని చెప్పారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాతగా నెహ్రూ వేసిన పునాదులు.. భారత్ ను ప్రపంచంలో గొప్పదేశంగా నిలిపిందన్నారు. పిల్లలను జాతి సంపదగా భావించి.. వారి భవితవ్యానికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. చిన్నారులే దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  పేర్కొన్నారు. అటువంటి చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి ఒక్క చదువేనని.. కనుకనే చిన్నారుల భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని వెల్లడించారు. రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచిస్తూ.. జవహర్ లాల్ నెహ్రూ కలలుగన్న సమాజ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు. నెహ్రూ ఆశయాల సాధనకు, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సమాజంలోని అన్ని వర్గాలు పని చేయాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *