Breaking News

ఆస్పత్రిలో జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తున్న.. సబ్ కలెక్టరు

-ప్రభుత్వాస్పత్రిలో ద్విచక్రవాహనాలు నిలుకునేందుకు రూ. 20 లక్షలతో షెడ్ ఏర్పాటుకు ప్రతి పాధనలు..
-అదనపు క్యాజువాలిటీ, రోగులు వెయిటింగ్ హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ..
-సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు దిచక్ర వాహనాలను నిలుపుకొనేందుకు ఆస్పత్రి ఆవరణలో పక్కా షెడ్ నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు.
జగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా ఆదివారం సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ కొత్త ప్రభుత్వ ఆస్పత్రని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆస్పత్రి ఉద్యోగులతో కలసి గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని టూవీలర్స్ వాహనాల పార్కింగ్ షెడ్ నిర్మాణానికి సంబందించి పునాది వేసే కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బందితో కలసి శ్రమదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు వారి వెంట వచ్చే సహాయకులు కూర్చునేందుకు సౌకర్యార్థంగా రూ. 20 లక్షలతో వెయిటింగ్ హాల్ ను రూ.18 లక్షలతో నిర్మిస్తున్న ఎక్స్ టెన్షన్ క్యాజువాలిటీ నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. పనుల నిర్వహణలో అవసరమైన నిధులు జిల్లా కలెక్టరు వారు అందిస్తారన్నారు. ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయకుండా నిర్థేశించిన స్థలంలోనే ఉంచేందుకు ఆస్పత్రి ఆవరణలో పర్మినెంట్ గా షెడ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహన పార్కింగ్ షెడ్ కు సుమారు రూ. 20 లక్షలు వ్యయం కానున్నదని, అందుకు సంబందించిన పతిపాధనలను సిద్దం చేసి రేపటి లోగా అందించాలని సబ్ కలెక్టరు తాహశీల్థార్ ను ఆదేశించారు. జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ప్రతి మొదటి, మూడవ ఆదివారాల్లో సుమారు వంద మంది క్లాప్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు. ఆస్పత్రి పరిశుభ్రతే లక్ష్యంగా దాతలు దాతృత్వంతో గోడలపై చక్కని పెయింటిగ్ లను వేయించి ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదరమైన వాతావరణం కల్పించారన్నారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ కుష్టు రోగులకు పాదరక్షలు పంపిణీ చేశారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న స్వచ్చ సంకల్పంలో(క్లాప్) కార్యక్రమంలో భాగంగా ప్రతి మొదటి, మూడవ ఆదివారాల్లో సుమారు వంద మంది వరకు ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్,వైద్య విద్యార్థులు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అదేవిధంగా గోడలకు పెయింట్ వేయుటకు బాపట్ల యంపీ సతీమణి 200 లీటర్ల, మోడల్ డెయిరీ ప్రజలు 40 లీటర్ల పెయింట్‌ను విరాళంగా అందించారన్నారు.
కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.ఏకుల కిరణ్ కుమార్, డిప్యూటీ సీఎస్ ఆర్ ఎంఓ డా. మంగాదేవి, నర్సింగ్ సిబ్బంది వైద్యులు, డా.వెంకటేష్, వైద్య విద్యార్థులు, సోమరాజు, రాము, వాసు,ర మేష్, ఆసుపత్రి అభివృద్ధి సభ్యులు సుజాత, ప్రభుదాస్, అంజిబాబు,విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *