కంకిపాడు/పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ఆదివారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ విస్త్రత పర్యటన చేసారు.
కంకిపాడు మండలం కందాలంపాడు గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు అందించే పౌష్టికాహార సరుకుల నాణ్యత ను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడలకు రంగులు వేయాలని, పాఠశాలకు సరైన పేవ్మెంట్ ఏర్పాటు చేయాలని, నీటి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కోలవెన్ను కందాలంపాడు గ్రామాల్లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లను, డబుల్ ఎంట్రీలు తొలగించడం,కొత్తగా అర్హులైన ఓటర్ల ఎంట్రీలపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెనమలూరు మండలం పోరంకిలోని గోసాల పోలింగ్ స్టేషన్,, జెడ్పీ హైస్కూల్, మండల పరిషత్ పాఠశాలలను సబ్‌కలెక్టర్ ప్రవీణ్ చంద్ తనిఖీ చేసి ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.డెత్ కేసులు, డబుల్ ఎంట్రీలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొని తొలగించెందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వీరి వెంట కంకిపాడు, పెనమలూరు తహసీల్దార్లు తోట వెంకట సతీష్, భద్రు నాయక్ తదితరులు వున్నారు.
Prajavartha Online Telugu News