Breaking News

వీరపనేనివారి గూడెంలో ముగిసిన నీతి ఆయోగ్ బృందం పర్యటన…

-ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డితో భేటీ కానున్న నీతి ఆయోగ్ సభ్యుల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నీతి ఆయోగ్ బృందం విజయవాడకు బయల్దేరింది. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరపనేని గూడెంలోని రైతు భరోసా కేంద్రాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. నీతి ఆయోగ్ బృందానికి వీరపనేని గూడెం గ్రామస్తులు వినూత్నంగా స్వాగతం పలికారు. సేంద్రీయపద్ధతిలో పండించిన కూరగాయలు, చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయంలో ప్రకృతి వ్యవసాయం పై మహిళా సంఘాలతో సమావేశం అయ్యింది. నీతి ఆయోగ్ బృందంతో పాటు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్‌ బృందం కృష్ణా జిల్లాలోని వీరపనేని గూడెంకు చేరుకుంది. వీరపనేని గూడెంలో బి.సతీష్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని పరిశీలించారు. రసాయనాలు వాడకుండా వరిసాగు చేసిన విధానాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం అడిగి తెలుసుకున్నారు.తొలుత ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సభ్యుల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు రాగా.. వారందరికి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయా క్షేత్రాలను నీతి ఆయోగ్ బృందం పరిశీలించింది.

అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో నీతి ఆయోగ్ బృందం భేటీ కానుంది. సాయంత్రం వివిధ పరిశ్రమల ప్రతినిధులు , పారిశ్రామిక సంఘాలు , వివిధ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు , విద్యా సంస్థల ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో నీతి ఆయోగ్ బృందం సమావేశం కానుంది.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *