నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా థర్డ్ వేవ్ రూపంలో ఇంకా పొంచి ఉందని, ప్రజలను అపప్రమత్తం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్యాధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కరోనా ముంపు ఇంకా సమసిపోలేదన్నారు. మొదటి, రెండవ వేవ్ లతో పోలిస్తే థర్డ్ వేవ్ మరింత ఉదృతంగా ఉండే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక దృష్ట్యా అధికారులు ప్రజలను మరింత అపప్రమత్తంగా ఉంచాలన్నారు. కొవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో ఎంతో మంది ఆప్తులను కోల్పోయారని, దానిని దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ లో అటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎవరికీ వారే స్వీయ నియంత్రణ చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి వాక్సినేషన్ ప్రజలందరికీ అందించడం జరిగిందని, కానీ కొంతమంది అపోహలతో ఇంకా మొదటి డోసు వాక్సినేషన్ తీసుకోలేదన్నారు. సచివాలయ పరిధిలో వాలంటీర్లు, ఏ. ఎన్ .ఎం. లు ఫీవర్ సర్వే లో ఇంకా మొదటి డోసు వేసుకొని అటువంటి వారిని గుర్తించి వెంటనే వాక్సినేషన్ వేసుకునేలా చూడాలన్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా, శానిటైజేర్ వినియోగించేలా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు చూడాలన్నారు. రద్దీ ఉన్న ప్రదేశాలలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. అన్ని షాపుల వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ ” బోర్డులు ఉండాలని, మాస్క్ లేని వారిని ఎట్టి పరిస్థితులలోనూ షాపులలోనికి అనుమతించకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ, డా.డి.ఆశ, ఇంచార్జి సి.ఐ ప్రసన్న వీరయ్య గౌడ్ నూజివీడు ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డా. నరేంద్ర సింగ్, సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరినాధ్, వైద్యాధికారులు డా.నరేంద్ర, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …