Breaking News

బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం, తనఖా పెట్టడం దుర్మార్గమైన చర్య… : వలిబోయిన గురునాధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం, తనఖా పెట్టడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి సోమవారం ఒక ప్రకటన  విడుదల చేశారు. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం సొంత పరిశ్రమ నడిపే అవకాశం ఉందని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారత దేశం ప్రగతి పథంలో ఉండటానికి ప్రధాన కారణం అనీ, నాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు చేయూతగా రాజ్యాంగ హక్కు కల్పించే విధంగా నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హాయంలో 45 వ రాజ్యాంగ సవరణ  జరిగిందని, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం ప్రియాంబుల్ సోషలిస్ట్ సోషలిస్టిక్ సిస్టమ్ గా మారిందన్నారు. బిజెపి నాయకుల్లారా బిజెపి సానుభూతిపరులా బిజెపికి మద్దతు పలికే ఇతర పార్టీల ముఖ్య మంత్రులారా రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిన సోషలిజం అంటే మీకు తెలిసినా, తెలియకపోయినా మరొకసారి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చదవండి అని అన్నారు. 1947 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ షుమారుగా వందలాది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కర్మాగారాలను నిర్మించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఉదాహరణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సర్వీసుల దగ్గర ఇస్రో వరకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పరిశ్రమలే ప్రస్తుతం దేశానికి ఉపయోగ పడుతున్నాయన్నారు. సోషలిజం అంటే ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేసి నడపడం, కానీ బిజెపి, వైసిపి పార్టీలు సోషలిజానికి భిన్నంగా ప్రభుత్వ సంస్థల నమ్మడం ఆస్తులను తనఖా పెట్టడం దుర్మార్గమైన చర్య అనీ, బిజెపి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ ఆస్తులను అమ్మేహక్కు, తనఖా పెట్టే హక్కు లేదని దీని వలన దేశ ఆర్థిక అభివృద్ధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రాజ్యంగం పేద ప్రజలకు కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు భంగం కలిగించే విధంగా వున్నాయని, బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీసీసీ లీగల్ సెల్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాటానికి సిద్ధంగా వుందని తెలియజేయడమైనదన్నారు. .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *