నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి పధకాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యత గ్రామ డైరీ సంఘం కార్యదర్సులదేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశపు హాలులో నూజివీడు, అగిరిపల్లి మండలాలకు చెందిన గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం పాడి రైతుల జీవన విధానాన్ని మారుస్తుందన్నారు. పశువులకు పోషకాలతో కూడిన దాణా, వైద్య సహాయం, పాడి పశువులు కొనుగోలుకు రుణాలు అందించడం తదితర ప్రయోజనాలుంటాయన్నారు. ఈ పధకం ద్వారా జిల్లాలోని పాడి రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటిని వారికి తెలియజేసి పధకం విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాల డైరీలు పాలల్లో వెన్న శాతం కొలిచే విధానం అశాస్త్రీయమైనదని, 7 నుండి 10 శాతం వెన్న ఉన్న పాలల్లో కూడా 5 శాతం వెన్న ఉందని పాడి రైతులు మోసపోయే అవకాశం ఉందన్నారు. కానీ అమూల్ సంస్థ వారు పాలల్లో వెన్న శాతాన్ని కొలిచే యంత్రాలు శాస్త్రీయతతో చాలా ఖచ్చితత్వంతో ఉంటాయన్నారు. అమూల్ పాల సేకరణలో వెన్న శాతం లెక్కింపులో ఖచ్చితత్వంలో రైతులకు లీటరుకు 5 నుండి 7 రూపాయల వరకు లాభం ఉంటుందన్నారు. పూటకు 200 లీటర్ల పాలను సేకరణ చేసే గ్రామ డైరీ సంఘం నెలకు 25 వేల నుండి 30 వేల రూపాయలకు పైగా ఆదాయం సంపాందించవచ్చన్నారు. ప్రతీ గ్రామ డైరీ సంఘంలో 11 మంది ప్రమోటర్లు ఉంటారని, వారు కార్యదర్శిని నియమించుకుంటారన్నారు. నూజివీ
90 రోజులపాటు నిరంతరాయంగా పాలు అందించిన పాడి రైతులు ప్రమోటర్లుగా ఎంపిక అయ్యేందుకు అర్హత సాధిస్తారన్నారు. నూజివీడు క్లస్టర్ లో 98 గ్రామాలున్నాయని, వాలంటీర్ల ద్వారా చేసిన సర్వే లో 35 వేల మంది పాడి రైతులు గేదెలు, ఆవులు కలిగి ఉన్నారన్నారు. ప్రతీ గ్రామ డైరీ సంఘంలో 11 మంది ప్రమోటర్లుగా ఉంటారని, వారు కార్యదర్శిని ఎంపిక చేసుకుని నియమించుకోవచ్చన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై , పాలు పోయని వారు మాత్రమే కార్యదర్శి నియామకానికి అర్హులన్నారు. పాల సేకరణలో గ్రామ డైరీ సంఘం ఆదాయం 3 రకాలుగా ఉంటుందన్నారు. రోజుకి 400 లీటర్ల పాలను సేకరించే సంఘానికి లీటరుకు 1 రూపాయి చొప్పున 400 రూపాయలు, పాల సాంపిల్స్ 30 ఎంఎల్. తీసుకుని, పరీక్ష అనంతరం వాటిని అమ్మితే రోజుకు 250 రూపాయల వరకు, రైతుల నుండి పాలను లీటర్ లలో తీసుకుని, కేజీలలో అమ్మడం జరుగుతుందని, దీనికారణంగా రోజుకు 200 రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని, మొత్తమ్మీద నెలకు గ్రామ డైరీ సంఘం ఆదాయం 25 వేల రూపాయల నుండి 30 వేల రూపాయలకు పైగానే ఉంటుందన్నారు. ఈ ఆదాయం నుండి సంఘం కార్యదర్శికి జీతం చెల్లించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రామ డైరి సంఘానికి పాల సేకరణ నిర్వహణకు 2 లక్షల విలువైన కంప్యూటర్లు, వెన్నశాతం కొలిచే యంత్రాలు, తదితరాలు అందించడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రైవేట్ పాల డైరీలు పాడి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధి తోడ్పడే జగనన్న పాల వెల్లువ పధకం విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ జాయింట్ రిజిస్ట్రార్ టి. ప్రవీణ, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.ఉమ, ఎంపిడిఓ పి . భార్గవి, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News