గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం అమలుపై అధికారులు, సిబ్బందితో సోమవారం సాయంత్రం ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం గంపలగూడెంలో నత్తనడకన సాగుతున్నదని, ముఖ్యంగా గంపలగూడెం, అమ్మిరెడ్డిగూడెం, మేడూరు, ఆర్లపాడులలో ప్రగతి లేదన్నారు. ఓటిఎస్ వినియోగించుకుంటే ఆస్తిపై పూర్తి హక్కుతో పాటు, అత్యవసర పరిస్థితులలో బ్యాంకులలో తనఖా పెట్టి ఋణం తీసుకోవచ్చు లేదా అమ్ముకునే అధికారం వస్తుందన్నారు. ఈ పథకం అమలుతో లబ్దిదారులకు కలిగే ప్రయోజనాలను తెలియజేసి వారిని చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం లక్ష్యాన్ని లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. ఎంపిడిఓ సచివాలయ సిబ్బంది , వాలంటీర్లతో సమన్వయము చేసుకుని పధకం వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపిడిఓ పిచ్చిరెడ్డి, సచివాలయ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …