విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యునైటెడ్ నేషన్స్– హబిటాట్ సీనియర్ ప్రతినిధులు మాన్సీ, ఆస్థా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ స్వాతి సింగ్ లతో కూడిన ప్రతినిధులు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవితో కలసి గురువారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో సమావేశం అయినారు. ఈ సందర్భంగా సుస్థిర నగరాలుగా అభివృద్ధి పరచాలనే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా యున్ – హబిటాట్ ప్రతినిధుల బృందం విజయవాడ నగరాన్ని సందర్శించి ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అద్యయనం చేసి అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందించుచునట్లుగా వివరించుట జరిగింది. ఈ సందర్భంగా మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్ లో ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన మౌలిక వసతులు కల్పించుటలో, నగరాన్ని పరిశుభ్ర మరియు సుందర నగరంగా తీర్చిద్దిదుటలో మరియు పెట్టుబడుల ఆకర్షణ కేంద్రముగా నగరాన్ని తీర్చిదిద్దుటకు ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …