-ఎమ్మెల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా మంచి నైపుణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎదగాలని శాసనసభ్యులుదూలం నాగేశ్వరరావు అన్నారు.
కైకలూరు గవర్నమెంట్ హైస్కూల్ లో ఏపీ సీయం కప్ నియోజకవర్గ స్థాయి స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఎంపీడీఓ వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు, శుభ ఆశీస్సులు తెలిపారు. విద్యార్థులు, చదువుతో పాటు, క్రీడలలో కూడా రాణించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఏపీసీఎం కప్ క్రీడల పోటీలు ఏర్పాటు చేశారన్నారు. గ్రామ స్థాయి విద్యార్థులలో క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి తీసుకుని వెళ్లాలన్నదే ఈ యొక్క క్రీడ పోటీల ఆశయమన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చదువు కోసం ఏ విద్యార్థి ఇబ్బందులు పడకూడదని, ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా నాడు -నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆధునీకరించి అభివృద్ధి చేయడమే కాకుండా విద్యార్థులు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ కార్యాక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎంపీపీ లకు పుష్ప గుచ్చంలు అందజేసి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎంఈవో రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.ఐ. షణ్ముఖసాయి, పీడీ నాగేశ్వరరావు, మాస్టర్లు, నాలుగు మండలాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News