-ఎమ్మెల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటపాక గ్రామ పంచాయతీలో రూ. 4 కోట్లతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేశామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
అనంతరం కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ఫ్రభుత్వ భవనాల నిర్మాణం కొరకు స్థానిక నాయకులతో కలిసి, స్థలం పరిశీలించారు. గ్రామంలోని సాయి నగర్ లో, దాతలు పెనుమత్స బాలరామరాజు గారు, గ్రామ పంచాయతీకి ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ భవనాలు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణాల స్థల పరిశీలన చేశారు. ఈ యొక్క స్థలంలో వున్న గడ్డి, మొక్కలను తొలిగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంఎల్ఏ మాట్లాడుతూ ఆటపాక గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి దాదాపుగా 2కోట్ల రూపాయలు నిధులు కేటాయించారన్నారు. ఇందులో బాగంగా ఇప్పటికే ఒక సచివాలయం భవన నిర్మాణం జరుగుతుందని, సచివాలయం-2, రెండు రైతుభరోసా కేంద్రాలు, రెండు ఆరోగ్యఉపకేంద్రాలు, రెండు బల్క్ మిల్క్ ప్రాజెక్టులు భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. వీటి నిర్మాణం కొరకు దాదాపుగా కోటిరూపాయలు నిధులతో భవన నిర్మాణాలు చేపట్టనున్నామని త్వరలోనే శంకుస్థాపన చేసి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో, వేగేశ్న రంగరాజు, పెనుమత్స బలరామరాజు, పంజా రామారావు, కన్న రమేష్, కన్న సాంబయ్య, రామిశెట్టి బుజ్జి, సింగంశెట్టి రాము, బందా నారాయణ, వేల్పూరి వెంకటేశ్వరరావు, భాస్కర వెంకటేశ్వరరావు, బోయిన రామకృష్ణ,, వడ్లాని సుబ్బారావు,తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News