Breaking News

“గురు స్పందన “ అవార్డు గ్రహిత నల్లమల్లి కుసుమ ను అభినందించిన అడిషినల్ కమిషనర్ (జనరల్) డా.జె. అరుణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ GDET మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పని చేయుచున్న నల్లమల్లి కుసుమ గురువారం విజయవాడ నగరపాలక సంస్థ అడిషినల్ కమిషనర్ (జనరల్) డా.జె. అరుణ ని మర్యాద పూర్వకంగా ఆమె ఛాంబర్ నందు కలిసారు. ఈ సందర్బంలో ది. 19-12-2021 న స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు కాకినాడ లో నిర్వహించిన టీచర్స్ రిలేషన్ షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ development (TREND) సదస్సు లో బి.సి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ  చేతుల మీదగా “ గురు స్పందన “ అవార్డు అందుకున్నారు. ఒత్తిడి లేని విద్య, సరళమైన బోధనా విధానం, స్నేహపూర్వక వాతావరణ, సమాజ పరిస్ధితుల పట్ల విద్యార్ధులకు కలిగిస్తున్న అవగాహన వలన ఆమె ఈ అవార్డు అందుకున్నట్లు వివరించారు. ఈ సందర్బంలో అదనపు కమిషనర్ (జనరల్) మాట్లాడుతూ ఉత్తమ అభిరుచి కలిగి, వృత్తి పట్ల అంకిత భావముతో విద్యార్ధులలో సృజనాత్మకతను వెలికితీసి వారిలోని ప్రతిభను మెరుగుపరచే ఉపాధ్యాయిని  కుసుమ లాంటి వారు మన విజయవాడ నగరపాలక సంస్థలో పని చేయుట అభినందనియమని కొనియాడుతూ, ఉపాద్యాయ వృత్తి వారి యొక్క సేవలను కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *