Breaking News

దేవుని ముందు  వి ఐ పి లు ఎవరూ కాదు… : ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఈనెల 13వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ముక్కోటి ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఉత్తరద్వార దర్శనానికి మరియు దక్షిణావృత శంఖం తో ఇవ్వనున్న శంకు తీర్థం క్యూ లైన్లను, భద్రతా చర్యలను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ముక్కోటి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అందరూ భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజేషన్ చేసుకోవాలని అన్నారు. అనంతరం దేవస్థానం దక్షిణం వైపున నిర్మిస్తున్న ప్రహరీ గోడను పరిశీలించారు. గాలిగోపురం ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక ను త్వరలోనే దేవస్థానానికి బదలాయింపు చేపడతామని ప్రస్తుతానికి ముక్కోటి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. అలాగే శంకు తీర్థం తీసుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని దేవాలయ అధికారులకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచనలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ క్యూలైన్లో వెళ్లాలని, దేవుని ముందు  వి ఐ పి లు ఎవరూ కాదని స్వామివారి దర్శనానికి వి ఐ పి పాసులు ఉండవని అన్నారు. భక్తులందరూ కరోన నియమ,  నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *