Breaking News

శ్రీ రామావతారంలో స్వామి దర్శనం…


తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దేవస్థానంలో లో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో ఏడో రోజు ఆదివారం స్వామివారిని శ్రీ పరాముని అవతారంలో హనుమంత వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీనివాసుడు దర్శన మిచ్చారు. భక్తులు ఉభయ దాతలు ఆ దేవదెవునికి విశేషపూజలు జరిపించి భక్థులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక కొనసాగుతాయని రేపు ఆది వారం శ్రీ బలరాముని రూపంలో స్వామి దర్శన మీయనున్నారని ఆలయ కమిటి వుప్పల వరద రాజులు తెలిపారు . ఈ రోజుజరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కటెవరపు చిన వేంకటరమణ ,వంగలమాథవరావు, అంకిశెట్టికృష్ణమూర్తి అవుతు పూర్ణకుమారి లింగినేని సుజాత కేతావత్ భాను ఆలయEO తిమ్మానాయుడు,ఆయ ప్రథాన అర్చకులు ఆళ్ళ హరి రవికుమార్ ఆలయ సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *