నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పాడి రైతులు అభివృద్ధి చెందాలంటే జగనన్న పాల వెల్లువ పధకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామం లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై ప్రమోటర్లు , పాడి రైతులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పాడి రైతుల అభివృద్ధికే ఆమలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాల డైరీల కన్నా పాలలో వెన్న శాతాన్ని ఖచ్చితంగా లెక్కించి లీటరుకు 7 నుండి 10 రూపాయల వరకు అదనంగా అందిస్తున్నారని పాడి రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ డైరీకి పాలు అందిస్తున్నందుకు నెలకు 3 నుండి 5 వేల రూపాయల అదనపు ఆదాయం పొందుతున్నారన్నారు. జగనన్న పాల వెల్లువ పథకంపై జిల్లాలో పాడి రైతుల నుండి మంచి స్పందన వస్తున్నదని, ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి, పాల సేకరణను మరింత పెంచాలని ప్రమోటర్లు, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎంపిడిఓ జి. రాణి, రెవిన్యూ , పశు సంవర్ధక శాఖ, జగనన్న పాల వెల్లువ పధకం ప్రమోటర్లు, గ్రామ వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Tags nuzividu
Check Also
త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …