కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలోని 15 కోవిడ్ కేర్ హాస్పిటల్స్ కి నోడల్ అధికారులను నియమించడం జరిగిందని బుధవారం ఒక ప్రకటన లో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆయా కోవిడ్ ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రిలో నోడల్ అధికారులు, మూడు షిఫ్ట్ లలో సహాయ నోడల్ అధికారులు కోవిడ్ వైద్య సేవలు, ఇతర అనుబంధ సేవలను, మౌలిక వసతులు కల్పించడంలో డాక్టర్లు, సహాయ సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యాల తో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ భాదితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చెయ్యడం జరుగుతుందని మల్లిబాబు తెలిపారు. ఆయా నోడల్ అధికారులు , వారి ఫోన్ నెంబర్ ల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని ఆయన తెలిపారు. జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులను కోవిడ్ ఆసుపత్రులలో నోడల్ అధికారిగా నియమించిన వారి వివరాలు : సి హెచ్ సి, కొవ్వూరు కి ఎమ్.గోవింద్ సీనియర్ ఇన్స్పెక్టర్ (సహకార) 8143292822 ; సీ.హెచ్.సి. నిడదవోలు జి.జవహర్ , అసిస్టెంట్ రిజిస్టర్ (డిసిఓ) 9440373376 ; సి హెచ్ సి. పెనుగొండ జై శంకర్, ఏ ఈ ఈ (ఇరిగేషన్) 9848560736 ; సి హెచ్ సి, గోపాలపురం ఎమ్. ధరణిబాబు, విఎఎస్ (వేటర్నిటీ) 6300672093 ; ఏరియా ఆసుపత్రి, తణుకు ఎన్. బాలమురళి కృష్ణ , ఏ ఈ (ఇరిగేషన్) 9885661663 ; గీతా హాస్పిటల్, తణుకు కె.శ్రీనివాస్ , ఏ ఈ (ఇరిగేషన్) 9493845083 ; సాయి శ్వేత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తణుకు కె.వెంకట ప్రసాద్, హెచ్ డబ్ల్యు ఓ 8328560946 ; సూర్య తేజా ఆర్థోపెడిక్ హాస్పిటల్, తణుకు కె.సుబ్బారావు , ఏ ఆర్ (సహకార) 98498 25896 ; సుధా హాస్పిటల్, తణుకు ఏవి సత్యనారాయణ, ఏ ఈ డ్రైనేజీ 7036601442 ; వంశీ హైటెక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తణుకు ఎమ్. కిరణ్ కుమార్ ఏ ఎల్ ఓ .. 9492555082 ; శ్రీ సాయి హాస్పిటల్, తణుకు డా.జి. రవికాంత్, విఏఎస్ (వెటర్నరీ) 9949983059 ; ఆపిల్ హాస్పిటల్, తణుకు .. పి. వివేకానంద , ఏఈ డ్రైనేజీ 9550944777 ; ఎస్ ఎమ్ వి ఆర్ ఎమ్ హాస్పిటల్, తణుకు కె ఎస్ భావన్నారాయణ, విఏఎస్ (వెటర్నరీ) 9849798456 ; వెంకట రమణ నర్సింగ్ హోమ్, తణుకు సీహెచ్. హరికృష్ణ, ఏ ఈ ఈ ఇరిగేషన్ – 94408 18717 ; శేషగిరి హాస్పిటల్, నిడదవోలు డా. ఎస్. రమేష్, విఏఎస్ (వెటర్నరీ) 8309626567 లను నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీచేసిందని ఆయన తెలిపారు.
Tags kovvuru
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …