విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ/వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అడపా శేషు , యం.శివరామకృష్ణ, తోలేటి శ్రీకాంత్, జమల పూర్ణమ్మ, తాతినేని పద్మావతిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలను అందిస్తున్నామన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. ఈ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే ప్రభుత్వం ఏపిసేవ 2.ఓ (టూ పాయింట్ ఓ) పౌర సేవల పోర్టల్‌ను తీసుకువచ్చామన్నారు. ప్రజలు ధరఖాస్తు చేసుకున్న ఆర్జీ ఎక్కడ, ఎవరిదగ్గర అగింది, పరిష్కారం కాకపోతే కారణాలు ఏంటీ వంటి సమాచారమంతా సచివాలయంలోని కంప్యూటర్లలోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. కింది ఉద్యోగులతో పాటు పైఉద్యోగులు కూడా భాధ్యతతో పనిచేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే సచివాలయ సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచాలన్నారు. సిబ్బంది సమర్థతతో పనిచేస్తే ప్రజలకు సమస్యలన్ని వెంటవెంటనే పరిష్కారమవుతయన్నారు. జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా సచివాలయ ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా జూలై 1 నుండి ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. అవినీతి లేకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో తక్షణం సేవలు ప్రజలలకు అందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 845 గ్రామ సచివాలయాలు, 440 వార్డు సచివాలయాలు ఉన్నాయన్నారు. అందులో 10వేల మంది సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. ధరఖాస్తు ఇచ్చినపట్టి నుంచి పరిష్కారమైయ్యేదాకా ట్రాక్ చేసేందుకే ఏపిసేవ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఆర్జీదారుని సేవ ఎక్కడ అగింది, కారణాలు తెలుసుకోవచ్చు అన్నారు. ఉద్యోగులు కూడా భాధ్యతతో వ్యవహరించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు సేవలు ఇంటి నుండే పొందేందుకు, ప్రభుత్వం నుండి తీసుకోవల్సిన సర్టిఫికేట్లు, డాక్యూమెంట్లు పొందే అవకాశం కల్పింస్తుందన్నారు. సచివాలయ పరిధిలోనే కాకుండా జిల్లాలోని ఏ సచివాలయం నుంచి అయిన తమకు కావాల్సిన సేవలు పొందవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …