విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా జిల్లా కలెక్టర్ జె. నివాస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గురువారం కమిషనర్ రంజిత్ బాషా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జె. నివాస్ రంజిత్ బాషాకు అభినందనలు తెలియజేస్తూ నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్( క్లాప్) కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తడిపొడి చెత్తలను విడివిడిగా క్లాప్ మిత్రలు సేకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించమని, నగరమంత పరిశుభ్రమవుతుందని ఆయన చెప్పారు. ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరంలోని పేదలకు ఇచ్చిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కోరారు. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తాను పనిచేసిన సమయంలోని అనుభవాలను రంజిత్ బాషాతో పంచుకున్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …