నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
బారతీయ ఎన్నికల కమిషన్ 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున “My Vote is My Future- Power of One Vote” అను నినాదంతో జాతీయ ఓటర్ల అవగాహన పోటీలను ప్రారంభించిందని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను పాటల పోటీలు, వీడియో మేకింగ్ , పోస్టర్ డిజైన్ , నినాదాలు, క్విజ్ వంటి 5 విభాగాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఆశక్తి కలిగిన యువతీ యువకులు,విద్యార్దులు, ఔత్సాహికులు మార్చ్.15.2022 లోపు https://ecisveep.nic.in/contest/ , voter-contest@eci.gov.in. ఈ రెండు వెబ్ సైట్స్ ద్వారా పేర్లు నమోదు చేస్కొని పోటీలో పాల్గొనవలసిందిగా తెలిపారు. పాటల పోటీల విభాగంలో సంస్థాగత దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50 వేలు, మూడవ బహుమతి 30 వేలు, ప్రత్యేక బహుమతి 15 వేల రూపాయలు, వృత్తిపరమైన దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 50 వేలు , రెండవ బహుమతి 30 వేలు, మూడవ బహుమతి 20 వేలు, ప్రత్యేక బహుమతి 10వేల రూపాయలు, ఔత్సాహిక దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 20 వేల రూపాయలు, రెండవ బహుమతి 10 వేలు, మూడవ బహుమతి 7 వేల 500, ప్రత్యేక బహుమతి 3వేల రూపాయలు బహుమతి మొత్తంగా అందించడం జరుగుతుందన్నారు. వీడియో మేకింగ్ పోటీల విభాగంలో సంస్థాగత దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి రెండు లక్షల రూపాయలు, రెండవ బహుమతి లక్ష రూపాయలు, మూడవ బహుమతి 75 వేలు, ప్రత్యేక బహుమతి 30వేల రూపాయలు, వృత్తిపరమైన దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 50 వేలు , రెండవ బహుమతి 30 వేలు, మూడవ బహుమతి 20 వేలు, ప్రత్యేక బహుమతి 10వేల రూపాయలు, ఔత్సాహిక దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 30వేల రూపాయలు, రెండవ బహుమతి 20 వేలు, మూడవ బహుమతి 10వేలు, ప్రత్యేక బహుమతి 5 వేల రూపాయలు బహుమతి మొత్తంగా అందించడం జరుగుతుందన్నారు. పోస్టర్ డిజైన్ పోటీల విభాగంలో సంస్థాగత దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 50 వేల రూపాయలు, రెండవ బహుమతి 30వేలు రూపాయలు, మూడవ బహుమతి 20 వేలు, ప్రత్యేక బహుమతి 10 వేల రూపాయలు, వృత్తిపరమైన దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 30వేలు , రెండవ బహుమతి 20 వేలు, మూడవ బహుమతి 10 వేలు, ప్రత్యేక బహుమతి 5 వేల రూపాయలు, ఔత్సాహిక దరఖాస్తుదారుల విభాగంలో మొదటి బహుమతి 20 వేల రూపాయలు, రెండవ బహుమతి 10 వేలు, మూడవ బహుమతి 7 వేల 500, ప్రత్యేక బహుమతి 3 వేల రూపాయలు బహుమతి మొత్తంగా అందించడం జరుగుతుందన్నారు. నినాదాల పోటీల విభాగంలో మొదటి బహుమతి 20 వేల రూపాయలు, రెండవ బహుమతి 10 వేలు రూపాయలు, మూడవ బహుమతి 7 వేల 500, ప్రత్యేక బహుమతిగా 50 మందికి 2 వేల రూపాయలు బహుమతి మొత్తంగా అందించడం జరుగుతుందన్నారు. క్విజ్ పోటీల విభాగంలో విజేతలకు ప్రత్యక బహుమతులు, ఈ-సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.
Tags nuzi
Check Also
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …