-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25వ తేదీ సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News