Breaking News

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎక్స సర్వీస్ మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ, శ్రీకాకుళం  గోపీనగర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటలువరకు స్టేట్ అసోసియేషన్ సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు మరియు వీరనారిలుమణులు మరియు వారి కుటంబసభ్యులు హాజరయ్యారు.  ఈ సమావేశానికి సభా అధ్యక్షులు గా రిటైర్డ్ సుబేదర్ మేజర్ ఎస్ ఎన్ మూర్తి, విశిష్ట అతిథిగా ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు  మరియు గౌరవ అతిథిగా వై.రమేష్ కుమార్ పాల్గొన్నారు. సభ్యులు అందరూ కూలంకుషంగా చర్చించి ఏకగ్రీవంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా ఎస్ ఎన్ మూర్తి ని, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నంబాల గోవింద రాజులు, సెక్రెటరీ గా ఎం. శంకర్ నారాయణ, ఉపాధ్యక్షులుగా సి హెచ్. అమ్మాజీ ని, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జి గా ఆర్ భాస్కర్ రావు ని అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జి గా ఎస్.రామారావు, ఆముదాలవలస నియోజవర్గమ్ ఇన్చార్జి గా సీహెచ్ అమ్మాజి రావు, నరసన్నపేట నియోజవర్గం డి.సాంబశివ రావు, టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జి గా సంభాల గోవింద్ రాజులుని, పలాస నియోజకవర్గం పి.మోహన్ రావు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.  లంచ్ తరువాత ఆటలు, సంగీత మరియు డ్యాన్స్ పోటీలు నిర్వహించి అందులో పాల్గొని గెలిచిన వారికి బహుమతులను విశిష్ట అతిది యం శంకర్రావు మరియు గౌరవ అతిథి వై రమేష్ కుమార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది, చివరిగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి జనగనమన గీతంతో  ఈ కార్యక్రమం ముగించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *