Breaking News

ఈనెల 31వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటు…

-ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు..
-నేటివరకు 81,756 మంది రైతుల నుండి 7,44,220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు…
-1,455.69 కోట్ల రూపాయల చెల్లింపులు…
-జిల్లా కలెక్టర్ జె నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 31వ తేదీలోపు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు జరుపుకొని మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. 2021-22 ఖరీఫ్ పంట కాలంలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 697 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుపుతున్నామని, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధర చెల్లింపులు చేస్తూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.2021- 22 పంటకాలంలో దాళ్వా పంట లేనందున ఈ నెల 31 వరకు కొనుగోలు కేంద్రాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉండి కొనుగోళ్లు జరపబడతాయని కలెక్టర్ అన్నారు జిల్లాలో నేటి వరకు 81,వేల756 మంది రైతుల నుండి 7,44,220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి 1,455.69 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇంకనూ అమ్మకాలు నిర్వహించవలసిన రైతులు తమ ధాన్యాన్ని ఈనెల 31వ తేదీ లోపు రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోళ్ళు జరుపుకొని మద్దతు ధర పొందాలని కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *