Breaking News

మానవాళి మనుగడకు జీవ వైవిధ్య పరిరక్షణ మనందరి సమిష్టి బాధ్యత..

-ప్రతి జిల్లాలో రూ. 2 కోట్లతో జీవ వైవిధ్య పార్కుల ఏర్పాటు…
-రాష్ట్రంలో 14,157 జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు పని చేస్తున్నాయి…
– రాష్ట్ర మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవాళి మనుగడకు జీవ వైవిధ్య పరిరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని ప్రభుత్వం జీవ వైవిధ్య మండలి ద్వారా అవసరమైన సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
విజయవాడ మురళి ఫార్చ్యూన్ హోటల్ లో బుధవారం జల సంబంధిత జీవ వైవిద్యం మరియు RET (అంతరించే) జాతుల పరిరక్షణకు ప్రణాళిక పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ను మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జీవ వైవిద్యం మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆహారం, దుస్తులు, నీడ, నివాసం మరియు మందులు మొదలైన వాటికీ ఇది కీలకమని మంత్రి అన్నారు. అడవుల్లోని మొక్కలు మరియు సముద్రపు జీవుల ద్వారా మాత్రమే మందులు మనకు సరఫరా చేయబడుతున్నాయని అన్నారు. 97 శాతం ఆహారం మొక్కలు ద్వారా సమకూరుతుండగా 3 శాతం ఆహారం జంతువుల నుండి వస్తున్నదని కాబట్టి మొక్కలు, జంతువులు మానవాళి మనుగడకు ముఖ్యమని మంత్రి అన్నారు.
మానవాళి మనుగడకు జీవ వైవిధ్య పరిరక్షణ అత్యావశ్యకమని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి అన్నారు. ఇదే స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి జీవ వైవిధ్య పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని మంత్రి తెలియజేసారు. రాష్ట్రంలో మొత్తం 14 వేల 157 జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేశామని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి స్థానిక సంస్థలతో కలిసి కార్యాచరణ ప్రణాళికతో ఈ కమిటీలు పని చేస్తున్నవని అయన తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో గ్రామస్థాయి జీవ యాజమాన్య కమిటీలకు మొదటి దశలో 10013 కమిటీలకు 9 కోట్ల 55 లక్షల 19 వేల 500 రూపాయలు నిధులు విడుదల చేశామని ఈ మొత్తం ఆ గ్రామస్థాయిలో ప్రాధాన్యత క్రమంలో అవగాహనా కార్యక్రమాలతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జీవ వైవిధ్య వ్యూహాలు మరియు కార్యాచరణ ప్రణాళిక 2021 నుండి 2030 వరకు సిద్ధం చేశామని ఈ ప్రణాళిక ప్రకారం కొన్ని అభివృద్ధి రంగాలు అటవీ, వన్య ప్రాణులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఉద్యానవనం, పశుసంవర్ధక మరియు ఇతర అభివృద్ధి ఏజెన్సీ ల ద్వారా జీవ వైవిధ్య అంశాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి అన్నారు. రాష్ట్రం లోని కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, అమరావతి మరియు కర్నూలు లలో మొత్తం 13 జిల్లాలలో జీవ వైవిధ్య పార్కులు మరియు మ్యూజియం లు అభివృద్ధికి సంబందించిన కార్యాచరణ ప్రణాలికను ఆమోదించమని ఈ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తింపు ఇతర అంశాలు పురోగతిలో ఉన్నవని మంత్రి అన్నారు. ఒక్కొక్క పార్కుకు ఒక కోటీ 50 లక్షల రూపాయలు మరియు మ్యూజియం ఏర్పాటుకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని మంత్రి అన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు నిపుణులు అయిన వారితో ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ వలన ప్రజల్లో అవగాహనతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి జరుగుతుందని ఈ వర్క్ షాప్ లో భాగస్వాములు అయిన వారందరికీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలియజేసారు.
ఈ వర్క్ షాప్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్ డా. బి.యం.కే. రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్ వేటర్ అఫ్ ఫారెస్ట్స్ అండ్ మెంబెర్ సెక్రటరీ ఏ పి స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు డా. డి. నళినీ మోహన్, నిపుణులు డా. మనోరంజన్ బన్ జా, సి.ఈ.ఓ. ఏపి ఎల్ డి ఏ గుంటూరు డా. టి. దామోదర్ నాయుడు, సైన్ టిస్ట్ లు డా. ఎల్. రసింగం, డా. కరూత పండి, డా. ఉమామహేశ్వర రావు, అన్ని జిల్లాల కమిటీల సభ్యులు, గ్రామ సర్పంచ్ లు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ లు, మత్య శాఖాధికారులు తదితరులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *