Breaking News

మధ్యాహ్న భోజన పధకంలో మెనూ సక్రమంగా నిర్వహించాలి…

-మెనూ పాటించని ఏజెన్సీ, పర్యవేక్షించని ప్రధానోపాధ్యాయులపై చర్యలు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సరిగ్గా అమలు చేయని ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటానని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను సోమవారం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను ఆర్డీఓ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యపై వండడాన్ని పరిశీలించిన ఆర్డీఓ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థినులకు సరిపడినంత ఆహారం తయారుచేయకపోవడంపై ప్రధానోపాధ్యాయునిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా కడుపు నిండా భోజనం పెట్టాలని అనుకుంటామో అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థినులను నాణ్యమైన భోజనాన్ని కడుపు నిండా పెట్టాలన్నారు. ప్రతీ విద్యార్థినీ వద్దకు వెళ్లి పాఠశాలలో పెట్టె భోజనం సరిపోతుందా? లేదా? భోజన నాణ్యతను గురిటినుంచి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థినులు ఇంటివద్ద నుండి భోజనం తెచ్చుకుని తినడాన్ని గమనించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమకు అనారోగ్యంగా ఉందని, అందుకే ఇంటివద్ద నుండి భోజనం తెచుకున్నామని విద్యార్థినులు ఆర్డీఓ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పధకం కింద పాఠశాలల్లో మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రతీరోజు అందించే భోజనాన్ని మెనూ వివరాలను పాఠశాలలో ప్రదర్శించాలన్నారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహరం అందించాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమన్నారు. మధ్యాహ్న భోజన పధకంలో ఏజెన్సీ వారు మెనూను సరిగా పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు తప్పనిసరిగా పరిశీలిస్తుండాలన్నారు. తాను మధ్యాహ్న భోజన పధకం అమలును తరచుగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, భోజన నాణ్యత, మెనూ సరిగా పాటించినట్లయితే సదరు ఏజెన్సీ , ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జగనన్న గోరుముద్ద పధకం కింద విద్యార్థినులకు పౌష్టికాహార ఆహార సరుకులను ఆర్డీఓ విద్యర్ధినులకు అందజేశారు. విద్యార్థినులు భోజనం చేసేందుకు సరైన డైనింగ్ సౌకర్యం లేదని గుర్తించి, అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయురాలు వి.వి. ఆదిలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 927 మంది విద్యార్థినులు కాగా, 826 మంది విద్యార్థినులు హాజరయ్యారని, 783 మంది విద్యార్థినులు మాత్రమే మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారన్నారు. మిగిలిన వారు వ్యక్తిగత కారణాలతో ఇంటివద్ద నుండి భోజనం తెచుకుంటున్నారన్నారు. ఆర్డీఓ వెంట సి.ఆర్. పి రాజ్యలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *