Breaking News

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని పరిష్కారంలో అలసత్వం వద్దని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారించాలన్నారు. . స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారానికి అర్హత దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పరిష్కారాన్ని వీలుకాని దరఖాస్తులను అందుకు గలా కారణాలను ధరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయలన్నారు. స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హెచ్చరించారు.
గన్నవరం మండలం చిన అవుటపల్లికి చెందిన శ్రీమతి గోగినేని ప్రభావతి దేవి తన దరఖాస్తులో తనకు చెందిన రెండు ప్లోట్స్లను చిన అవుటపల్లిలో నిర్మిస్తున్న టెక్నో పార్క్ నిమిత్తం భూసేకరణలో తీసుకున్నారని, ఇంతవరకు నష్టపరిహారం చెలించలేదని, తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ విషయమును వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని గన్నవరం తహసీల్దార్ ను ఆర్డీఓ ఆదేశించారు. నూజివీడు మండలం బోరవంచ గ్రామానికి చెంది రామకూరి అజయ్ కుమార్ తన దరఖాస్తులో తానూ మిలిటరీ లో చైనా-ఇండో బోర్డర్లో సేవలందించానని, తనకు అసైన్మెంట్ ల్యాండ్ మంజూరు చేయవలసిందిగా కోరారు. సదరు దరఖాస్తును పరిశీలించి నివేదిక సమర్పించాలని నూజివీడు తహసీల్దార్ ను ఆర్డీఓ ఆదేశించారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన భీమవరపు లక్ష్మరెడ్డి తన దరఖాస్తులో తన 81 సెంట్ల భూమికి సంబందించిన భూమి రికార్డు నకళ్ళు మంజూరు చేయాలనీ కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన మద్దిరెడ్డి సుబ్బారెడ్డి తన దరఖాస్తులో తనకు చెందిన భూమిలో 98 సెంట్ల భూమికి సంబంధించి ఆన్లైన్ లో వివరాలు నమోదు కాలేదని, సదరు భూమి వివరాలు ఆన్లైన్ లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరగా, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *