Breaking News

సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యాహ్న భోజన పధకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక రెడ్ సర్కిల్ లోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున ఆహార నాణ్యతను సోమవారం సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో వారంవారిగా అందించే మెనూ సక్రమంగా అమలు చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచిచూశారు. భోజనం ఎలా ఉంది…. సరిపోతుందా. ఇంటి దగ్గర తింటున్న దానికి ఇక్కడ భోజనానికి తేడా ఉందా… అని సబ్ కలెక్టర్ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సబ్ కలెక్టర్ ఆదేశించారు. వారం వారిగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా పాటించాలని, ఆకస్మికంగా తనిఖీ చేస్తానని నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఏజెన్సీని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలో సబ్ కలెక్టర్ తో పాటు డిప్యూటీ డిఇఓ రవి కుమార్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *