Breaking News

కృష్ణాజిల్లా లోనే అతిపెద్దదీ ‘ కరగ్రహారం జగనన్న కాలనీ లే అవుట్‌ ‘… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీ లే అవుట్‌ జిల్లాలోనే అతిపెద్దగా వెలసిందని,ఇక్కడ 316 ఎకరాల్లో 15,998 మంది ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి శాశ్వత నివాసానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.
బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీ లే అవుట్‌ వద్దకు విచ్చేసి వివిధ శాఖల అధికారులతో 12 బ్లాకుల వారీగా జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. స్థలాల మెరక, చదును పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థలాలకు సర్వే రాళ్లు ఎన్ని పాతిస్తున్నారని ? రోజుకు వంద సర్వే రాళ్లు మాత్రమే ఎందుకు పాతిస్తున్నారని, అంతకన్నా ఎక్కువ పాతించడంలో ఎదురవుతున్న అవరోధాలు ఏమిటని మంత్రి ప్రశ్నించారు. స్టోనింగ్ పనులలో జాప్యం కాకుండా రాళ్లు సరఫరాను వేగవంతం చేయాలనీ అవసరమైతే, వేర్వేరు ప్రాంతాల నుంచి సైతం రప్పించుకోవాలని అన్నారు. లేఔట్ లో ప్రస్తుతం పనిచేసే కూలీలు 70 మంది సరిపోరని వారి సంఖ్య పెంచుకోవడంతో పాటు ఉదయం 8 గంటలకే పనిలో నిమగ్నమయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. హెచ్, ఎల్ బ్లాక్ లోని ఇళ్లస్థలాల మెరక సర్వే రాళ్లు పాతించడం తదితర పనులు మునిసిపల్ ఏ ఇ పిల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉగాది నాటికి పూర్తి చేయాలని సూచించారు. లే అవుట్లో ఎన్ని రోవర్లు పని చేస్తున్నాయని ,అదనంగా ఏమైనా అవసరం ఉందా అని అధికారులను మంత్రి పేర్ని నాని అడిగారు. లబ్ధిదారులు త్వరితగతిన బేస్‌మెంట్‌ పనులు ప్రారంభిస్తే లబ్ధిదారులకు నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాబడుతుందని చెబుతూ, రాష్ట్రంలో 31 లక్షల మందికి , కృష్ణాజిల్లాలో 3 లక్షల 34 వేల మందికి, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేలకు పైగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగా చరిత్ర పురుషుడన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, ఆర్డీవో ఖాజావలి, మునిసిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, తహసీల్దార్‌ డి.సునీల్‌ బాబు, మునిసిపల్ ఎం ఇ త్రినాధ్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారి రాజబాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎం. డి యాకూబ్, వి ఆర్ ఓ రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, శొంఠి ఫరీద్, బందెల థామస్ నోబుల్, చిటికెన నాగేశ్వరరావు, కొలుసు హరిబాబు, గాజుల భగవాన్, మహమ్మద్ రఫీ, పలువురు లబ్దిదారులు తదితరులున్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *