విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ , సిఎంల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సమాజిక అంశాలపై లోతుగా సమాలోచించారు. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని సిఎం గవర్నర్ కు వివరించారు. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఎన్ టిఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ కాంతీ రాణా టాటా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …