రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటి సంవత్సరం పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 16,763 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1,834 మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో ఈ రోజు నిర్వహించిన ఇంగ్లీష్పేపర్-1 పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు. సోమవారం ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్ల పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం 19,399 మంది, ఒకేషనల్ కోర్సు మొదటి ఏడాది పరీక్షలకు 2195 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి 12471 మందికి గాను 12,188 మంది హాజరు కాగా 353 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1267 కి గానీ మందికి గాను 1123 మంది హాజరు కాగా 144 మంది హాజరు కాలేదని తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకి 4833 మందికి గాను 4575 మంది హాజరు కాగా 258 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 828 కి గానీ మందికి గాను 711 మంది హాజరు కాగా 117 మంది హాజరు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలికవసతులపై విద్యార్థినిలని కలెక్టర్ వివరాలుఅడిగారు. పరీక్షా కేంద్రంవద్ద త్రాగునీరు, ఇతర వసతులపై వివరాలు తెలుసుకుని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు.
Tags rajamendri
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …