విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం విజయవాడలోని 23వ డివిజన్ గవర్నర్‌పేటలోని 97,98 సచివాలయాలను కలెక్టర్ డిల్లీరావు ఆకస్మీక తనిఖీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయానికి వచ్చే ఆర్జీలు బియండ్ ఎస్‌ఎల్‌ఏ పరిధిలోకి వెళ్లకుండా పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు. వివిధ పథకాల కింద లబ్ది పొందుతున్న లబ్దిదారుల జాబితా ప్రదర్శన తీరును ఆయన పరిశీలించారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ భాగాలకు సంబంధించిన రిజిస్ట్రర్లను, సిబ్బంది హాజరు పటికను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ నుండి క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయాల సిబ్బందితో ఆయన ఫోన్‌లో మాట్లాడి సిబ్బంది పనిచేస్తున్న ప్రాంతాలలోని పనితీరును ఆరా తీశారు. సక్రమంగా లేని మరుగుదోడ్లను గమనించిన ఆయన సచివాలయల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …