విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, వైద్య ఆరోగ్య శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లాలో సుస్థిరాభివృద్ధి ప్రగతిలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య, వైద్య ఆరోగ్య శాఖలు సూచీలను కలెక్టర్ డిల్లీరావు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య ఆరోగ్య శాఖలు నెలవారి సాధించాల్సిన సూచికలు నవరత్నాలు ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మద్యనిషేదం, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, 108,104,అంబులెస్స్ వాహనాల సదుపాయాలు, వైఎస్సార్ కంటివెలుగు తదితర పథకాలను అమలు చేయడం ద్వారా సాధించవచ్చునన్నారు. ఈ శాఖకు సంబంధించి నెలవారి, సంవత్సరంలో సాధించవలసినవి రెండు సూచికలు ఉన్నాయన్నారు. విద్య శాఖలో నాడు`నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర పథకాలను జిల్లాలో అధికారులు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్మాలను చేరుకోవచ్చునని కలెక్టర్ అధికారులకు సూచించారు. పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, లింగ అసమానతలు, నిరక్షరాస్యత, పర్యావరణ సమతౌల్యం, జీవవైధ్యం, తదితర అంశాలు సుస్థిరాభివృద్ధికి కీలకంగా ఉన్నాయని, వీటిని అధిగమిస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. నెలవారి సాధించవల్సిన లక్ష్యాలను సంబంధిత శాఖలు పూర్తి చేయడం ద్వారా ఏడాదికి నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవచ్చునన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయని వాటి సాధనలో సంబంధిత శాఖలు ఏ స్థాయిలో ఉన్నమో తెలుసుకోనేందుకు ఏర్పాటు చేసిన సూచీల గురించి అవగాహన కలిగివుండాలన్నారు. ఆ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కోరారు. సుస్థిరాభివృద్ధి సూచీలలో వెనుకబడిన అంశాలపై దృష్టి పెట్టి వాటిని మెరుగు పరచాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జడ్పిసిఇవో సూర్యప్రకాష్, సిపివో రత్నరూత్, డిఇవో సివి రేణుక, డియంహెచ్‌వో యం సుహాసిని, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …