విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఆలిండియా జర్నలిస్ట్ యూనియన్ ఆదేశాల మేరకు . మంగళవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ చేపట్టిన జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది. మీడియా కౌన్సిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రెస్ కౌన్సిల్ లో అందరికీ సభ్యత్వం కల్పించాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని వర్కింగ్ జర్నలిస్ట్ హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు అయిదులక్షలు తక్షణమే ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ కల్పించాలని, ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్ లను పునరుద్ధరించాలని జిల్లా స్థాయిలో ఉన్న స్థానిక పత్రికలకు రెండు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ బస్సు పాస్ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం విషాదకరమని పేర్కొన్నారు. అలాగే బీమా వసతి కల్పించాలని ప్రభుత్వానికి ఈ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ కు విజ్ఞాపనపత్రం అందజేయగా తాను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, రాజేశ్వరరావు కొండా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు జి రామారావు, దాసరి నాగరాజు, దారం వెంకటేశ్వరరావు, ఎస్కే బాబు, జిల్లా అధ్యక్షులు యూ. వెంకట్రావు ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సాంబశివరావు, కోశాధికారి బీవీ శ్రీనివాసరావు, స్సామ్నా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …