Breaking News

రాజా నగరం నియోజవర్గ స్థాయి హౌసింగ్ సమావేశం..

-పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, జేసీ తదితరులు
-గ్రామాల వారీగా కూలంకుషంగా సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భూములను సంబంధించిన ప్రతిపాదనలు ఏవి పెండింగ్లో ఉండకుండా క్షేత్రస్థాయిలో చూడాలని, మంజూరైన సంబందించిన పనులను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత ఆదేశించారు.

మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గ స్థాయి సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ నగరం, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి యొక్క అర్హత వున్న లబ్ధిదారునికి ఇంటి స్థలాన్ని కేటాయించాలన్నారు. ఇందుకు అవసరమైన భూమిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రాజానగరం నియోజకవర్గం లోని మూడు మండలాల పరిధిలో గ్రామాల వారీగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలు సమీకృతం చేసి నిర్దుష్టమైన సంఖ్య కి రావాలసి ఉందన్నారు. మీ మండలాలలో ఏ ఏ గ్రామాల్లో లే అవుట్ లని సిద్దం చేశారు, వాటికి అనుగుణంగా ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో కలెక్టర్ గ్రామాల వారీగా సమీక్షించి, మ్యాప్ ను పరిశీలించారు. పురుషోత్తమ పట్నం గ్రామంలో స్మశాన వాటిక కి సంబంధించి స్థలం కేటాయింపు విషయంలో భూ కేటాయింపులు జరిపి, ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఇళ్ళు లేని పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి, మండల స్థాయి అధికారులు అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయడం ముఖ్యం అని కలెక్టర్ మాధవీలత తెలిపారు. జాయింట్ కలెక్టర్ భూసంబంధ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తహశీల్దార్ల కి తగిన మార్గదర్శకం చేయాలన్నారు. సమావేశంలో ప్రతి గ్రామం వారీగా సమీక్షించామన్నారు. తహశీల్దార్లు ప్రతిపాదించిన పనులు ఏవి కూడా పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలని, ఆర్డీవో ప్రత్యక్షం పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, అర్హతఉన్నప్రతిఒక్కలబ్ధిదారులకుఇంటిస్థలంమంజూరుచెయ్యడంజరుగుతుందన్నారు. జగనన్న ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా అర్హులైన వారికి పట్టాలు పంపిణీచేయడంజరుగుతుందన్నారు. నియోజక వర్గం నుంచి వచ్చిన అభ్యర్థనలలో వారి గ్రామం లో గానీ, సమీపంలో గానీ ఇంటి స్థలం మంజూరు కోసం కోరుతున్నరన్నారు. ఏ ఏ గ్రామాల్లో ఎంత మంది లబ్దిదారులు ధరఖాస్తు చేసుకున్నారు, వారిలో ఎంత మందికి ఇప్పటి వరకు మంజూరు పత్రాలు అందజేశారు, ఇంకా ఇళ్ల పట్టాలు పంపిణీ చెయ్యవలసిన వాటి వివరాల పై చర్చించారు. రాజానగరం, కోరుకొండ, భూపాలపట్నం, పుణ్య క్షేత్రం, జీ. ఎర్రంపాలెం, కొండ గుంటూరు, చక్రద్వార బంధం, శ్రీరాం పురం, కాపవరం, నందరాడ, కలవచర్ల, గాదరాడ, సంపత్ నగరం, సీతారాం పురం, తోకాడ, పురుషోత్తమ పట్నం, వెలుగు బంద, కాటవరం, రాధేయ పాలెం, శ్రీకృష్ణ పట్నం, తదితర గ్రామాల వారీగా యధార్థ స్థితి పై కూలంకుషంగా సమీక్షించి, మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తహశీల్దార్లు ఎన్. ఎస్. పవన్ కుమార్, పి హెచ్. జీ. ఆర్. పాపారావు, ఎస్. బాల సుబ్రహ్మణ్యం, ఎంపిడివో లు ఎన్ వి మూర్తి, రమేష్ కుమార్, నరేష్ కుమార్, డిప్యూటీ ఈ .. డిప్యూటీ ఈ ఈ పరుసురాం, తదితరులు ఉన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *