మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈసారి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించడమే కాకుండా.. కృష్ణ, గోదావరి డెల్టాలకు, రాయలసీమ ప్రాజెక్టులకు ముందుగానే సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఉద్గాటించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ ఏడాది ముందస్తుగా వ్యవసాయ సీజన్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే కృష్ణా, గోదావరి జలాలను విడుదల చేస్తామని తెలిపారు. గతంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆగస్టు నెలలో సాగునీటిని విడుదల చేసేవారని, అందుకు భిన్నంగా ప్రభుత్వం కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ పరిణామామని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి జూన్ 10న నీటిని విడుదల చేస్తామని, నాగార్జున సాగర్ నుంచి జూన్ 15 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. అదే విధంగా రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జూన్ 30 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో రైతులు సంతోషంగా ఖరీఫ్కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. ఖరీఫ్ సీజన్ను ముందే ప్రారంభిస్తే. పంట కూడా ముందుగానే రైతుల చేతికి వస్తుందని ఆయన తెలిపారు. నవంబర్లో తుపానులు వచ్చే నాటికే పంట చేతికి వస్తుందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు మూడు పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయని అదేమాదిరిగా ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ గత ఏడాది ,ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయిని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రిని అభ్యర్దించారు. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సాగునీటి విడుదలకు అంగీకరించారు. ఈ చర్యతో డెల్టా ప్రాంత రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారని రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుందని మంత్రి జోగి రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags machilipatnam
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …