విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన మిలటరీ ఏడీసీ మేజర్ సాహిల్ మహాజన్‌కు వీడ్కోలు పలికారు. ఆగస్టు 2019లో ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఏడీసీగా బాధ్యతలు స్వీకరించిన సాహిల్ మహాజన్, పదవీకాలం పూర్తయిన నేపధ్యంలో శనివారం విధుల నుంచి రిలీవ్ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా సాహిల్ మహాజన్‌ను గవర్నర్ శ్రీ హరిచందన్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సాహిల్ గవర్నర్ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలోనూ శ్రద్ధ వహించడమే కాకుండా, విధి నిర్వహణలో సంతృప్తికరమైన సేవలు అందించారన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి. బెహరా, ఎడిసి (పోలీస్) ఈశ్వరరావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసిరావు, లైజన్ అధికారి టివి నరసింహన్ తదితరులు సాహిల్ పనితీరును అభినందించారు. భవిష్యత్తులో మంచి విజయాలను నమోదు చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …